పెళ్లి సంబంధాలు చూస్తున్నారనే మనస్తాపంతో..

18 Aug, 2021 10:22 IST|Sakshi
శిరీష (ఫైల్‌)

సాక్షి, బొమ్మలరామారం (నల్లగొండ): పెళ్లి సంబంధాలు చేస్తున్నారని మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మంగళవారం మండలంలోని మైలారం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వడ్లకొండ శిరీష(17) పదో తరగతి వరకు చదివింది. ఇంటర్‌లో చేరే సమయంలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో ఇంటి వద్దే ఉంటుంది.

ఈ నేపథ్యంలో శిరీషకు పెళ్లి చేద్దామని కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురై మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భువనగిరి జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై వెంకన్న తెలిపారు. 

మరిన్ని వార్తలు