తండ్రి మందలించడంతో.. కూతురి బలవన్మరణం

8 Jul, 2021 14:55 IST|Sakshi
భువనేశ్వరి (ఫైల్‌) 

సాక్షి, చిన్నంబావి (మహబూబ్‌నగర్‌): తండ్రి మందలించడంతో కూతురు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఇది. స్థానికుల కథనం ప్రకారం.. వనపర్తి జిల్లా చిన్న బావి మండలంలోని అయ్యవారిపల్లికి చెందిన బొక్కలమ్మ, కురుమయ్య దంపతులకు కూతురు భువనేశ్వరి (16), కుమారులు అక్షయ కుమార్‌,హేమంత్‌ ఉన్నారు. కూతురు గత ఏడాది పదోతరగతి పాసైనా ఇంటి వద్దే ఉంటుంది. కాగా, మంగళవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఫోన్‌లో మాట్లాడుతుండటం, ఎస్‌ఎంఎస్‌లు పంపడాన్ని పెద్ద తమ్ముడు చూశాడు.

ఈ విషయమూ తండ్రికి చెప్పడంతో మందలించాడు. దీంతో మనస్తాపానికి గురై అదే అర్థరాత్రి పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం కొల్లపూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయింది. ఈ సంఘటనతో ఆకుటుంబలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

మరిన్ని వార్తలు