షాకింగ్‌ వీడియో.. మెట్రో స్టేషన్‌పై నుంచి దూకి యువతి ఆత్మహత్యాయత్నం

14 Apr, 2022 16:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: గుర్తు తెలియని ఓ యువతి మెట్రో స్టేషన్ గోడపైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ఈ ఘటన ఢిల్లీలోని అక్షరధామ్ మెట్రో స్టేషన్‌లో గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సదరు యువతి గాయపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. ఓ యువతి మెట్రోస్టేషన్‌ గోడ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెట్రో స్టేషన్‌లో ఉన్న సిబ్బంది,  సీఐఎస్ఎఫ్ జవాన్లు ఆమె మాటల్లో పెట్టి రక్షించే ప్రయత్నం చేశారు. ఆత్మహత్య చేసుకోవద్దని ఎంత చెప్పినా యువతి పట్టించుకోలేదు. 

ఎలాగైనా ఆమె కాపాడాలన్న ఉద్దేశ్యంతో జవాన్లు.. ఆమె పై నుంచి దూకబోయే ముందు మెట్రో స్టేషన్ కింద రక్షణ వలను ఏర్పాటు చేశారు. యువతిని కాపాడాలని సిబ్బంది ఆమె వద్దకు వెళ్లే ప్రయత్నం చేయగా యువతి కిందకు దూకింది. ఈ ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ముందు జాగ్రత్తగా అధికారులు అంబులెన్స్‌ను పిలిపించడంతో వెంటనే ఆమెను లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సీఐఎస్‌ఎఫ్‌ అధికారిక ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా ట్రెండింగ్‌లో నిలిచింది. 

మరిన్ని వార్తలు