పదిరోజుల్లో తేజ పెళ్లి.. పెద్దలు పత్రికలు పంచుతుంటే..

16 May, 2022 07:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పావగడ(బెంగళూరు): త్వరలో ఆ ఇంట పెళ్లి జరగబోతోంది. కానీ అంతలోనే విషాదం తాండవించింది. పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పళవల్లి గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని తేజ (19) నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంది. బంధువుల అబ్బాయితో ఈ నెల 25న ఆమెకు పెళ్లి నిశ్చయించారు. తల్లిదండ్రులు బంధుమిత్రులకు పెండ్లి పత్రికలు పంపిణీ చేస్తున్నారు. తేజ ఇంట్లో పెయింట్లో కలిపే టర్పెంటాయిల్‌ను పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలతో ప్రాణాలు వదిలింది. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. ఉదయమే మృతదేహానికి అంత్యక్రియలు చేశారు.

మరో ఘటనలో..

కత్తిపోట్లకు గురైన హిజ్రా మృతి
శివాజీనగర:  కాటన్‌ పేట లోని శివాస్‌ లాడ్జ్‌లో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన కత్తిపోట్ల ఘటనలో తీవ్రంగా గాయపడిన అర్చనా(25) అనే హిజ్రా మృతి చెందింది. బాధితురాలిని విక్టోరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందింది. ఇదే ఘటనలో మరో ఇద్దరు గాయపడగా చికిత్స పొందుతున్నారు. కాటన్‌ పేట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

చదవండి: ఈనెల 11న నిశ్చితార్థం.. ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకుని..

మరిన్ని వార్తలు