అన్న కొడుకుతో ప్రేమ వ్యవహారం.. మందలించడంతో

26 Oct, 2020 08:31 IST|Sakshi

పోలీస్‌ క్వార్టర్స్‌లో ఘటన

సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఉట్నూర్‌ డీఎస్పీ ఉదయ్‌రెడ్డి

సాక్షి, నార్నూర్‌: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ క్వార్టర్స్‌లో శుక్రవారం రాత్రి ఇందూరు వైష్ణవి (15) అనే బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. ఎస్‌హెచ్‌ఓ బి.శ్రీనివాస్‌ తెలిపిన వివరాలివీ.. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గతేడాదిగా హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఇందూరు ఊశన్న–వసంతలది ఆదిలాబాద్‌ గ్రామం. తన భార్య వసంత ఆదిలాబాద్‌లో అంగన్‌వాడీ విధులు నిర్వహిస్తుండగా, కరోనా నేపథ్యంలో తన కూతురు వైష్ణవితో కలిసి స్థానిక క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. తన ఏకైక కూతురును గారంగా పెంచారు. ఆమె ఆదిలాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.  (ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయి.. ఆస్తి కోసం)

రెండేళ్లుగా వైష్ణవికి వరుసకు అన్న అయిన సడ్డకుని అన్న కొడుకుతో ప్రేమ వ్యవహారం సాగుతోంది. గమనించిన కుటుంబ సభ్యులు గతంలోనే వారిని మందలించారు. ఇదే విషయమై తరచూ గొడవలు జరిగేవి. ఆమెకు కౌన్సెలింగ్‌ సైతం చేసినా మార్పు రాలేదు. శుక్రవారం రాత్రి ఫోన్‌లో చాటింగ్‌ చేస్తుండగా గమనించిన తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురైనట్లు పేర్కొన్నారు. కాగా బాలిక మృతి అనుమానాస్పదంగా ఉందని తల్లి వసంత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌ఓ శ్రీనివాస్‌ వివరించారు. ఇదిలా ఉండగా సంఘటన స్థలాన్ని ఉట్నూర్‌ డీఎస్పీ ఉదయ్‌రెడ్డి పరిశీలించారు.  
(అనుమానించి ఉద్యోగం మాన్పించాడు.. చివరకు!)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు