Odisha: బాలికల అక్రమ రవాణా

15 May, 2021 08:52 IST|Sakshi

మల్కాన్‌గిరి: భైరపుట్‌ మండలం కుడుములుగుమ్మ గ్రామానికి చెందిన బాలికలను అక్రమంగా తరలిస్తున్న సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రతిరోజు మాదిరిగానే తహసీల్దారు విజయ్‌ మండాంగి గ్రామంలో తనిఖీ చేస్తుండగా, ఓ వాహనంలో కూర్చున్న ఐదుగురు బాలికలను గమనించారు. ఎక్కడికి వెళుతున్నారని అడిగినా బాలికలు జవాబివ్వక పోవడంతో చైల్డ్‌లైన్‌ సిబ్బందిని పిలిపించారు.

వీరిని వలసకూలీలుగా ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతం బాలికలను మాల్కాన్‌గిరి శిశుసంక్షేమ కేంద్రంలో ఉంచారు. దర్యాప్తు అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు చైల్డ్‌లైన్‌ సిబ్బంది తెలిపారు.
చదవండి: Tamil Nadu: ప్రాణం తీసిన సెల్ఫీ పిచ్చి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు