ప్రేమ పేరుతో షికార్లు.. ప్రియుడి బర్త్‌ డే రోజున ఆమె.. 

3 Apr, 2022 08:14 IST|Sakshi

మైసూరు: వారిద్దరూ నాలుగేళ్లుగా డీప్‌గా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో షికార్లు సైతం కొట్టారు. పెళ్లి చేసుకుంటానని ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరిగాడు. తీరా పెళ్లి అనే సరికి ఆమెను అందరి ముందే అవమానించాడు. ఈ క్రమంలో వేదన భరించలేక యువతి ఆత్మహత్యయత్నం చేసింది. ఈ ఘటన కర్నాటకలోని నంజనగూడు తాలూకాలోని కందెగాలలో జరిగింది.

వివరాల ప్రకారం..  త్యాగరాజు, కావ్య అనే యువతి మధ్య నాలుగేళ్లుగా ప్రేమాయణం సాగుతోంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన త్యాగరాజు ఆమెతో షికార్లు చేశాడు. శుక్రవారం పుట్టిన రోజు జరుపుకుంటున్న త్యాగరాజును పెళ్లి గురించి కావ్య ప్రశ్నించగా అతడు అందరి ముందు అవమానించాడు. దీంతో ఆవేదనకు గురైన యువతి అక్కడే ఉన్న పురుగుల మందును తాగింది. దీంతో స్థానికులు ఆమెను మైసూరు కేఆర్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది.

మరిన్ని వార్తలు