ప్రియుడు మాట్లాడలేదని విషం తాగుతూ వీడియో తీసి..

26 Nov, 2022 07:33 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, చెన్నై(వేలూరు): ప్రియుడు మాట్లాడలేదని ఓ ప్రియురాలు విషం తాగుతూ వీడియో తీసి, ప్రియుడికి పంపి, ఆత్మ హత్యకు పాల్పడింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. పోలీసుల కథ నం మేరకు.. తిరుపత్తూ రు జిల్లా నాట్రంబల్లి సమీపంలోని కరుణానిధి గ్రామానికి చెందిన తిరుమాల్‌ కుమార్తె శరణ్య(23) కృష్ణగిరిలోని ప్రైవేటు కళాశాలలో ఎంఏ మొదటి సంవత్సరం చదువుతోంది.

ఇదిలాఉండగా ఈమె అదే గ్రామానికి చెందిన ఆర్మీ సిపాయి అరుణ్‌ ప్రేమించుకున్నారు. వీరిద్దరూ మనస్పర్థల కారణంగా ప్రస్తుతం మాట్లాడుకోవడం లేదు. దీంతో మనోవేదనకు గురైన శరణ్య ఈనెల 11వ తేదీన శీతల పానీయంలో విషం కలిపి తాగి, ఆ విషయాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో రికార్డ్‌ చేసి ప్రియుడికి పంపింది. అపస్మారక స్థితికి చేరుకున్న శరణ్యను కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం తిరుపత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

ఆమె పరిస్థితి విషమం కావడంతో సేలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శరణ్య శుక్రవారం ఉదయం మృతి చెందింది. ప్రియుడిని బెదిరించేందుకు విషం తాగిన శరణ్య చికిత్స పొందుతూ మృతి చెందడంతో ఆ ప్రాంతంలోని వారిని కలిచి వేసింది. ఈ మేరకు నాట్రంబల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: (Darshit: కన్నా..ఇక కనిపించవా..)

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు