చెప్పు దెబ్బలు తిన్న జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు

1 Nov, 2020 20:08 IST|Sakshi

లక్నో : లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న కారణంతో ఇద్దరు యువతులు కలిసి అందరూ చూస్తుండగానే ఒక వ్యక్తిని చెప్పులతో దేహశుద్ది చేసిన ఘటన ఆదివారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని జలాన్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. జలాన్‌కు చెందిన అనూజ్‌ మిశ్రా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. కాగా ఆదివారం అనూజ్‌ మిశ్రా జలాన్‌ సమీపంలోని ఒరై రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఇంతలో స్టేషన్‌వైపు వస్తున్న ఇద్దరు యువతులపై అనూజ్‌మిశ్రా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈవ్‌ టీజింగ్‌కు పాల్పడడమే గాకుండా లైంగిక వేధింపులకు గురిచేశాడు. (చదవండి : బట్టతల దాచి పెళ్లి చేసుకున్నాడని..)

దీంతో ఆగ్రహించిన సదరు యువతులు అనూజ్‌ మిశ్రాను పట్టుకొని తమ చెప్పులతో దేహశుద్ది చేశారు. చివరికి అనూజ్‌మిశ్రా క్షమించమని మహిళ కాళ్లు మీద పడ్డా అ‍ప్పటికే కనికరించలేదు. అప్పటికే కోపంతో ఊగిపోతున్న వారు అతని బట్టలు చించేసి మరోసారి చితకబాదారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకొని అనూజ్‌ మిశ్రాను విడిపించి అతనిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడికి ఈ శాస్తి జరగాల్సిందే అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు