రోడ్డు ప్రమాదం: బంగారం వ్యాపారులు మృతి

23 Feb, 2021 14:35 IST|Sakshi

పెద్దపల్లి: రామగుండం ఎన్టీపీసీ సమీపంలోని మల్యాలపల్లి వద్ద ఉన్న రాజీవ్ రహదారిపై మంగళవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారు అతి వేగంగా వెళ్లి బోల్తా పడడంతో ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ ఘటనలోని మృతులు, క్షతగాత్రులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. బంగారం వ్యాపారం చేసే కొత్త రాంబాబు, కొత్త శ్రీనివాస్, శ్రీనివాస్ బావమరిది సంతోష్ మరో వ్యక్తి కారులో రామగుండం మీదుగా మంచిర్యాల బెల్లంపల్లి వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యారు. కారు బోల్తా పడడంతో నలుగురు అందులో ఇరుక్కుపోయారు.

స్థానికులు గమనించి బయటకు తీసే లోపే బంగారం వ్యాపారం చేసే రాంబాబు ప్రాణాలు కొల్పోయారు. ఆసుపత్రికి తరలించగా శ్రీనివాస్ మృతి చెందారు. డ్రైవర్ సంతోష్, శ్రీనివాస్ బావమరిది సంతోష్‌కు తీవ్రగాయాలు కాగా వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను రామగుండం ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారులో కిలోన్నర బంగారం లభించిందని పోలిసులు పేర్కొన్నారు. ముందుగా సంఘటన స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది బంగారం ప్యాకెట్లను రామగుండం పోలీసులకు అప్పగించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. 

చదవండి: 
దాబాకు వెళ్లి.. వెంటనే వచ్చేస్తామని చెప్పి

బంగారం ఉందో లేదో అడుగుతూ 

మరిన్ని వార్తలు