శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

9 Oct, 2022 02:37 IST|Sakshi
పట్టుబడిన బంగారం  

ఐదుగురు ప్రయాణికుల నుంచి 4.3 కేజీల బంగారం స్వాధీనం 

శంషాబాద్‌: బంగారం అక్రమ రవాణా పరంపర కొనసాగుతోంది. తాజాగా శనివారం ఐదుగురు వేర్వేరు ప్రయాణికుల నుంచి అధికారులు 4.3 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. దుబాయ్‌ నుంచి ఈకే–524 విమా నంలో వచ్చిన మహిళ తన తలకు ఉన్న హేర్‌ బ్యాండ్‌లో 234 గ్రాముల బంగారం తీసుకొచ్చింది. కువై ట్‌ నుంచి జె9–403 విమానంలో వచ్చిన ఇద్దరు ప్రయాణికుల లగేజీలో 855 గ్రాముల బంగారాన్ని తీసుకొచ్చారు.

బిస్కెట్లు, గుండీల రూపంలో బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకు న్నారు. దుబాయ్‌ నుంచి వచ్చిన ఈకే –526 విమానంలో మరో ముగ్గురు మహిళా ప్రయాణికు లను అనుమానించిన అధికా రులు వారిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముగ్గురి లోదుస్తుల నుంచి 3283 గ్రాముల బంగారం పేస్టు ను బయటికి తీశారు. దీని విలువ రూ. 1.72 కోట్లు ఉంటుందని అధికా రులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు