లోన్‌ యాప్స్‌పై గూగుల్‌ ప్లేస్టోర్‌ ఉక్కుపాదం

16 Jan, 2021 18:39 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఇన్‌స్టా‍ంట్‌ లోన్‌ యాప్స్‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పోలీసుల రిక్వెస్ట్‌తో యాప్స్‌ తొలగింపు ప్రక్రియ మొదలుపెట్టిన గూగుల్‌ ప్లేస్టోర్‌ ఇప్పటివరకు 200కు పైగా లోన్‌యాప్స్‌ను తొలగించింది. మరో 450కి పైగా లోన్‌ యాప్స్‌ను తొలగించాలని పోలీసులు గూగుల్‌కు లేఖ రాశారు.  హైదరాబాద్‌ నుంచి 288..  సైబరాబాద్‌లో 110‌.. రాచకొండ నుంచి 90 లోన్‌ యాప్స్‌ తొలగించాలని లేఖలో పేర్కొన్నారు. ( యూట్యూబ్‌ వీడియోల స్పూర్తితో.. )

ఈ కేసుకు సంబంధించి పోలీసులు వందల సంఖ్యలో బ్యాంక్‌ అకౌంట్లను ఫ్రీజ్‌ చేశారు. ఇప్పటివరకు 3 కమిషనరేట్లలో కలిపి రూ.450 కోట్ల నగదు ఫ్రీజ్‌ అయింది. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో కొట్టేసిన డబ్బులతో చైనీయులు ఈ లోన్‌ యాప్‌లను నడిపారు. ఇప్పటివరకు నలుగురు చైనా దేశస్తులు అరెస్టయ్యారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు