చూస్తుండగానే కృష్ణానదిలో దూకిన డాక్టర్‌

24 Aug, 2020 08:12 IST|Sakshi

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమం): భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తడంతో ఓ ప్రభుత్వ వైద్యుడు ఆదివారం రాత్రి అందరూ చూస్తుండగానే కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా వాసి డాక్టర్‌ అద్దేపల్లి శ్రీనివాస్‌ (40) గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు కొత్తపేటలో భార్యాపిల్లలతో ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో డా. శ్రీనివాస్‌ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుని ప్రకాశం విగ్రహం వద్ద మెయిన్‌ కెనాల్‌లోకి దూకేశారు.
(చదవండి: విదేశీ యువతిపై అత్యాచార యత్నం)

అంతకుముందు తన జేబులో ఉన్న ఐడీకార్డు, ఆధార్, ఫోన్‌లను తీసి పక్కనే పెట్టేశారు. ఈ హఠాత్పరిణామాన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే ఉన్న విజయవాడ వన్‌టౌన్‌ సీఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో తాడు సాయంతో శ్రీనివాస్‌ను పైకి తేవడానికి ప్రయత్నించారు. నీటి వడి ఎక్కువగా ఉండటంతో అందరూ చూస్తుండగానే శ్రీనివాస్‌ కనపడకుండా మునిగిపోయారు. అతను వదిలేసిన ఫోన్‌లో నంబర్ల ఆధారంగా తండ్రికి ఫోన్‌ చేయగా.. భార్యాభర్తలమధ్య గొడవ జరిగిందని ఆయన తెలిపారు.  
(చదవండి: రూ.కోటి కోసం బాలుడి కిడ్నాప్‌)

మరిన్ని వార్తలు