దర్భంగా పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌లో హైఅలర్ట్‌

12 Jul, 2021 16:39 IST|Sakshi
ఫైల్‌ఫోటో

సాక్షి, హైదరాబాద్‌ : దర్భంగా పేలుళ్ల నేపథ్యంలో నగరంలో హైఅలర్ట్‌ ప్రకటించారు. పండగల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు నిఘా పెంచారు. కాగా, ఎన్‌ఐఏ అధికారులు తాజాగా హైదరాబాద్‌లో ఒకరిని, యూపీలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. యూపీ-హైదరాబాద్‌ లింకులపై ఆరా తీస్తున్నారు. ఉనికిని చాటుకునేందుకు లష్కరే తొయిబా స్లీపర్‌సెల్స్‌ను యాక్టివ్‌ చేసినట్లు.. విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేసినట్లు తెలుస్తోంది.

దర్భంగా పేలుడు కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దర్భంగా రైల్వే స్టేషన్‌లో జరిగిన విస్ఫోటం కేసులో హైదరాబాద్‌ కేంద్రంగా బాంబు తయారుచేయడంతో విచారణను ఇక్కడ నుంచి మొదలు పెట్టారు.   ఈ కేసుకు సంబంధించి నలుగురు ఉగ్రవాదులను ఎన్‌ఐఏ కస్టడీలోకి తీసుకుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం పండుగలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో హై అలెర్ట్‌ ప్రకటించారు.

మరిన్ని వార్తలు