క్లాస్‌రూమ్‌లో హఠాత్తుగా ఫ్యాన్‌ పడటంతో విద్యార్థినికి గాయాలు

30 Aug, 2022 14:37 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీలో నాంగ్లోయ్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాల్లోని తరగతి గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌ హఠాత్తుగా విద్యార్థిని పై పడింది. దీంతో ఆమె తలకు తీవ్రగాయమైంది. ప్రస్తుతం సదరు విద్యార్థిని నాంగ్లోయ్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.  వాస్తవానికి క్లాస్‌ రూమ్‌ గదిలో పైన ఉన్న సీలింగ్‌ తడిగా ఉండి బొట్టుబొట్టుగా నీరు కారుతోందని విద్యార్థిని చెబుతుంది.

దీంతో సీలింగ్‌ తడికి నానిపోయి విరిగి పోవడంతోనే ప్యాన్‌ పడిపోయిందని చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆగస్టు 27న క్లాస్‌ జరుగుతుండగానే ఒక్కసారిగా ప్యాన్‌ కుప్పకూలిపోయిందని వెల్లడించింది. ఐతే ఈ ఘటనపై ప్రభుత్వం గానీ, స్కూల్‌ యాజమాన్యంగానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థిని వాపోయింది. 

(చదవండి: నకిలీ బంగారం పెట్టి.. కుటుంబ సభ్యుల ఖాతాలతో రూ.60 లక్షలు స్వాహా)

మరిన్ని వార్తలు