తాళికట్టి రోజు గడవక ముందే.. నవ్వును దూరం చేసి దుఃఖాన్ని మిగిల్చి

19 Jun, 2022 10:03 IST|Sakshi
జమ్మాన పవన్‌కుమార్‌ (ఫైల్‌)

ఆ పెళ్లిని మృత్యువు వెక్కిరించింది. కలకాలం కలిసి ఉంటామని బాసలు చేసుకున్న కొత్త జంటను కర్కశంగా విడదీసింది. పసుపు కుంకుమలను రక్తంతో తుడిచేసింది. తాళి కట్టి ఒక్కరోజైనా గడవక ముందే వరుడి ప్రాణాలను మింగేసింది. పెళ్లి ఆనందంలో ఉన్న రెండు కుటుంబాలకు నవ్వును దూరం చేసి దుఖాన్ని మిగిల్చింది. శుక్రవారం రాత్రి సింహాచలంలో వివాహం చేసుకున్న జమ్మాన పవన్‌కుమార్‌ (20) శనివారం మధ్యాహ్నానికి అరిణాం అక్కివలస వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 

ఎచ్చెర్ల క్యాంపస్‌/ఎల్‌ఎన్‌ పేట: అరిణాం అక్కి వలస వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎల్‌ఎన్‌ పేట మండలం పెద్దకొల్లివలస గ్రామానికి చెందిన జమ్మా న పవన్‌కుమార్‌ మృతి చెందాడు. అతడి మేన మామ బలగ సోమేశ్వరరావు గాయపడ్డారు. పవన్‌ కుమార్‌ విశాఖలోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి శుక్రవారం రాత్రి సింహాచలంలో ఇదే మండలం శ్యామలాపురం ఆర్‌ఆర్‌ కాలనీకి చెందిన యువతితో వివాహం జరిగింది. వివాహం చేసుకున్న వీరు స్వగ్రామంలో వారం రోజులు ఉందామని సింహాచలం నుంచి శనివారం బయల్దేరారు.

చదవండి: (పెళ్లయిన ఐదు రోజులకే.. మామ చేతిలో అల్లుడి దారుణ హత్య)

పెళ్లి జనమంతా బస్సులో రాగా.. పవన్‌ మాత్రం తన మేనమామతో కలిసి బైక్‌పై బయల్దేరాడు. ఎచ్చెర్ల మండలం అరిణాం–అక్కివలస ప్రాంతానికి వచ్చే సరికి వీరి బండిని వెనుక నుంచి వస్తున్న కంటైనర్‌ ఢీకొంది. దీంతో పవన్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. సోమేశ్వరరావుకు గా యాలయ్యాయి. వెనుక వస్తున్న మరో లారీ డ్రై వర్‌ 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి గాయపడిన వ్యక్తిని అంబులెన్స్‌లో రిమ్స్‌కు తరించారు. ఎ చ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు.  
 
రెండు గ్రామాల్లో విషాదం  
పవన్‌ మృతి చెందాడన్న వార్త తెలిసి అతడి స్వ గ్రామం పెద్దకొల్లివలస పునరావస కాలనీలో ను, వధువు ఊరు శ్యామలాపురం ఆర్‌ఆర్‌ కాలనీలోను విషాదం అలముకుంది. ఒక్క రోజులో నే ఎంత ఘోరం జరిగిందని చర్చించుకున్నారు.   

మరిన్ని వార్తలు