పోలీస్టేషన్‌ ముందే కొట్లాట...బీజేపీ కార్పోరేటర్‌ భర్తను చితకబాదిన పారిశుద్ధ్య కార్మికులు

14 Oct, 2022 11:20 IST|Sakshi

ఇండోర్‌: పారిశుద్ధ్య కార్మికుల బృందం బీజేపీ కార్పోరేటర్‌ భర్తను పోలీస్టేషన్‌ ముందే చితకబాదేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌లోని రౌ పోలీస్టేషన్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...సందీప్‌ చౌహన్‌పై ఫిర్యాదు చేసేందుకు పారిశుద్ధ్య కార్మి​కులు పెద్ద ఎత్తున సముహంగా పోలీస్‌ స్టేషన్‌వద్దకు వచ్చారు. సదరు వ్యక్తి ఒక పారిశుద్ధ్య కార్మికురాలిని ఫోన్‌లో దుర్భాషలాడటంతో.... ఆమె బంధువులు, తోటి కార్మికులు ఆగ్రహావేశాలతో ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కి వచ్చారు.

దీంతో పోలీసులు సందీప్‌ చౌహన్‌ని పోలీస్టేషన్‌కి పిలపించి ఇద్దరి మధ్య సమస్య రాజీ చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం తలెత్తి చౌహన్‌పై దాడి చేసేందుకు యత్నించారు పారిశుద్ధ్య కార్మి​కులు. అంతేగాదు ఇరు వర్గాలు ఒకరిపై ఒకరి దాడి చేసుకుని, బెదిరింపులకు దిగినట్లు ఫిర్యాదులు చేసుకున్నారని అధికారులు తెలిపారు.  ఐతే చౌహన్‌ భార్య 13వ వార్డు రౌ మున్సిపాలటి బీజేపీ కార్పోరేటర్‌.

(చదవండి: మాస్కో విమానంలో బాంబు కలకలం...అప్రమత్తమైన అధికారులు)

మరిన్ని వార్తలు