ఆశ చంపమంది.. అపరాధ భావం చంపేసింది! 

4 Oct, 2021 08:54 IST|Sakshi
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న టెక్కలి సీఐ నీలయ్య, క్లూస్‌టీమ్‌

సాక్షి, సంతబొమ్మాళి: ఓ వ్యక్తి మనసులో పుట్టిన ఆశ అతడిని హత్యకు ఉసిగొల్పగా.. దొంగతనం చేశానన్న అపరాధ భావం అదే వ్యక్తిని ఆత్మహత్యకు పురిగొల్పింది. మండలంలోని బోరుభద్రలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్ర కారం.. పట్నాన జగన్నాథం, పార్వతి దంపతులు బోరుభద్రలో పకోడీలు, బజ్జీలు విక్రయిస్తూ బతుకుతున్నారు. శనివారం రాత్రి జగన్నాథం దుకాణం పని మీద బయటకు వెళ్లగా, భార్య పార్వతి ఇంటిలో ఒంటరిగా ఉన్నారు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన గుడ్ల ఆనందరావు జగన్నాథం ఇంటికి వచ్చారు.


ఆనందరావు  

చదవండి: (ఫేస్‌బుక్‌ ప్రేమ.. యువకుడి చేతిలో మోసపోయి)

తనకు రూ.10వేలు అప్పు కావాలని ఇంట్లో ఉన్న పార్వతిని అడగ్గా ఆమె తన వద్ద లేవని సమాధానమిచ్చింది. కానీ ఆనందరావు ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును లాగడానికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టి పుస్తెల తాడుతో పారిపోయాడు. పార్వతి కేకలు విన్న ఇరుగుపొరుగు వారు ఇంటికి వచ్చి చూ సేసరికి ఆమె రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే వారు జగన్నాథంకు సమాచారం అందించారు. అలాగే 108కు ఫోన్‌ చేయడంతో బాధితురాలిని కోటబొమ్మాళి ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. సంతబొమ్మాళి ఎస్‌ఐ గోవింద కేసు నమోదు చేశారు. టెక్కలి సీఐ ఆర్‌.నీలయ్య, క్లూస్‌టీం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. 

అయితే శనివారం రాత్రి ఇక్కడ చోరీ, హత్యాయత్నం చేసిన ఆనందరావు తనను ఎక్కడ పట్టుకుంటారో అన్న భయంతో పార్వతీపురం పారిపోయాడు. కుటుంబమంతా బోరుభద్రలోనే ఉండడం ఇకపై తనను గ్రామానికి రానివ్వరని భయపడడం, దొంగతనం చేశానన్న అపరాధ భావంతో ఆయన ఆదివారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నా డు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.  

చదవండి: (కుమార్తెతో మద్యం తాగించి లైంగిక దాడి.. ప్రియురాలితో వీడియో)

మరిన్ని వార్తలు