Gujarat Car Accident Today: భక్తులపైకి దూసుకెళ్లిన ఇన్నోవా.. ఆరుగురు దుర్మరణం

2 Sep, 2022 10:00 IST|Sakshi

గాంధీనగర్‌: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అరవల్లీ జిల్లా కృష్ణాపూర్ సమీపంలో ఇన్నోవా కారు బీభత్సం సృష్టించింది. బనాస్‌కాంఠలోని అంబాజీ ఆలయానికి కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ భయానక ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేశ్ పటేల్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రలకు రూ.50వేలు సాయం అందిస్తామన్నారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అంబాజీ ఆలయంలో ప్రతి ఏటా భదర్వీ పూనం ఉత్సవాలు నిర్వహిస్తారు. గుజరాత్, రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వస్తుంటారు. కాలినడకనే బనాస్‌కాంఠా వెళ్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి 10 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే భక్తులు మరాఠ్‌వాడీ వెళ్తుండగా కారు అదుపుతప్పి వారిపైకి దూసుకెళ్లింది.
చదవండి: భారీ అగ్నిప్రమాదం.. 300 సిలిండర్లున్న లారీలో పేలుడు

మరిన్ని వార్తలు