డ్రగ్స్ రాకెట్ కేసు: రంగంలోకి ఎన్ఐఏ!

25 Sep, 2021 13:24 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: డ్రగ్స్ రాకెట్ కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) రంగంలోకి దిగనుంది. ఉగ్రవాదం కోణంలో ఎన్‌ఐఏ దృష్టి సారించనుంది. డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చే డబ్బుతో ఉగ్రవాదులు మారణాయుధాలు కొనుగోలు చేస్తున్న కోణంలో విచారణ జరపనుంది. తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత అఫ్ఘాన్ నుంచి వచ్చే సరుకుపై గట్టి నిఘా ఏర్పాటు చేయనుంది.

సరకు రవాణా ముసుగులో ఉగ్రవాదులు మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్నారు. ఇప్పటికే దేశంలోని హెరాయన్‌ అక్రమ దిగుమతి కేసులో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ ఎనిమిది మందిని అరెస్ట్‌ చేసిన చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. అఫ్గానిస్తాన్‌లోని కాందహార్‌ నుంచి ఇరాన్‌లోని ముంద్రా పోర్టుకు వచ్చిన రెండు కంటెయినర్లలో 2,998 కేజీల హెరాయిన్‌ను ఈ నెల 17, 19 తేదీల్లో స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. 


 

మరిన్ని వార్తలు