కోడలిపై అత్తా,మామల పైశాచికం

5 Aug, 2020 20:00 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

నిందితులపై గృహ హింస కేసు

అహ్మదాబాద్‌ : కోడలి శరీరంలో దెయ్యం ఆవహించిందని ఆమెను తన కుమారుడితో కాపురం చేయకుండా అడ్డుకున్న మామ ఉదంతం గుజరాత్‌లో వెలుగుచూసింది. కోడలితో తన కుమారుడు కాపురం చేస్తే దెయ్యం అతడిలో ప్రవేశిస్తుందంటూ వారి వైవాహిక బంధాన్ని ఆయన అడ్డుకున్నట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదుతో గృహ హింస చట్టం కింద నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అత్తింటి వేధింపులను తాను అడ్డుకుంటే అత్తమామలు, భర్త తనను తీవ్రంగా కొట్టారని 43 ఏళ్ల బాధిత మహిళ ఆరోపించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది ఫిబ్రవరిలో వీరు కోర్టు వివాహం చేసుకున్నారు. చదవండి : అందంగా లేదని, బక్కగా ఉందని..

వివాహానంతరం తన భర్తతో కలిసి నివసించేందుకు మహిళ వదోదర నుంచి గాంధీనగర్‌ వచ్చారు. తాము శారీరకంగా కలిస్తే తనలో ఉన్న దెయ్యం ఆత్మ వారి కుమారుడిలో కలుస్తుందని తన మామ ఆక్షేపిస్తున్నారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. మామ తనను లైంగిక వేధింపులకు గురిచేసేలా స్వయంగా అత్త ప్రేరేపిస్తున్నారని వాపోయారు. తాను ఒంటరిగా ఉన్నప్పుడు తనను లొంగదీసుకోవాలని ఆమె తన మామకు నూరిపోసేవారని ఆరోపించారు. ఇక అత్తింటి వేధింపులు భరించలేక మార్చి 10న తాను ఆ ఇంటి నుంచి బయటకు వచ్చానని, కుటుంబ సభ్యులు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినా వారు తనను ఆదరించేందుకు అంగీకరించలేదని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు