కోనసీమ జిల్లాలో తుపాకీ కాల్పుల కలకలం

5 Sep, 2022 12:33 IST|Sakshi

సాక్షి, రావులపాలెం (కోనసీమ జిల్లా): డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలో కాల్పులు కలకలం రేగింది. రావులపాలేనికి చెందిన ఫైనాన్స్‌ వ్యాపారి సత్యనారాయణరెడ్డి ఇంటికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. వారిని చిన్న కుమారుడు ఆదిత్యరెడ్డి చూసి ఎవరంటూ ప్రశ్నించారు. దీంతో ఆయనపై కాల్పులు జరిపి దుండగులు పరారయ్యారు. కాల్పుల్లో ఆదిత్యరెడ్డి చేతికి గాయాలయ్యాయి. ఆదిత్యరెడ్డి ఎదురు తిరగడంతో గన్‌, బ్యాగ్‌ వదిలి దుండగులు పరారయ్యారు. దుండగులు వదిలి వెళ్లిన బ్యాగ్‌లో నాటు బాంబులు లభ్యమయ్యాయి.
చదవండి: ఆ వెబ్‌సైట్‌ను చూస్తుండగా వాట్సాప్‌కు వీడియో.. తీరా చూస్తే అందులో..

మరిన్ని వార్తలు