ఘోరం: కుందేలు అనుకోని మిత్రునిపై తూటా.. దీంతో..

18 Jun, 2021 11:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మైసూరు(కర్ణాటక): వలస కూలీ బతుకు విషాదాంతమైంది. కుందేలు అనుకుని స్నేహితుడు కాల్చడంతో చనిపోయాడు. వివరాలు.. కేరళకు చెందిన ఎంఎస్‌ ప్రసన్న, నంజనగూడు తాలూకాలోని కురిహుండి గ్రామంలో అల్లం తోటలో కూలీ.  నంజనగూడు తాలూకా కుత్తువాడి గ్రామానికి చెందిన స్నేహితుడు నిషాద్‌ ఇంటికి ప్రసన్న భోజనానికి బయల్దేరాడు. అదే సమయంలో నిషాద్‌ కుందేళ్లను వేటాడాలని తుపాకీతో పక్కనే ఉన్న పొలానికి వెళ్లాడు.

దూరంగా పొదల్లో ప్రసన్న నడిచి వస్తుండగా కుందేలు అనుకుని నిషాద్‌ తుపాకీ పేల్చాడు. దగ్గరికి పోయి చూడగా ప్రసన్న తూటా తగిలి గాయపడి ఉన్నా­డు. వెంటనే కేఆర్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. నిషాద్‌ పరారీలో ఉన్నాడు. హుల్లహళ్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 

చదవండి: మనోవేదన: చితి పేర్చుకుని దూకేశాడు

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు