భార్య నగ్న వీడియోల కేసులో మరో ట్విస్ట్‌

23 Nov, 2020 11:12 IST|Sakshi

సాక్షి, పట్నంబజారు(గుంటూరు): భార్య నగ్న వీడియోలు ఆమెకు తెలియకుండా తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసిన కేసులో మరిన్ని కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం మేరకు.. ఏటీ అగ్రహారానికి చెందిన మహిళ నగ్న వీడియోలను ఆమె భర్త తీసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయటంపై కేసు నమోదైన విషయం విధితమే. భర్తను విచారించిన క్రమంలో మరిన్ని వాస్తవాలు తెలిపినట్లు సమాచారం. వీడియోలను బహిర్గతం చేయటంతో పాటు ‘లైవ్‌ స్ట్రీమింగ్‌’ యాప్‌ ద్వారా తన భార్య ఆశ్లీలంగా ఉన్న దృశ్యాలను డబ్బుల కోసం చూపించేవాడని విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియోలను ఎంతో మంది చూశారు తదితర అంశాలపై ఐటీ కోర్‌ విభాగం అధికారులు కూపీ లాగుతున్నారు.   చదవండి:  (భార్య నగ్న వీడియోలు యూట్యూబ్‌లో..)

సదురు మహిళ ఆశ్లీల దృశ్యాల కోసం ఒక టైమ్‌ కేటాయించి, నిర్ణీత సమయంలో ఆమె ఆశ్లీల దృశ్యాలను డబ్బులు తీసుకుని చూపించినట్లు తెలిసింది. వీడియోల కోసం డబ్బులు చెల్లించిన కొద్ది మంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న అర్బన్‌ ఉన్నతాధికారులు ఐటీ కోర్‌ విభాగంతో పాటు, సాంకేతిక నిపుణత కలిగిన సిబ్బందిని కేటాయించి వాస్తవాలు వెలికి తీసే పనిలో పడ్డారు. సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడింగ్‌పై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. డబ్బు కోసం భర్త చేస్తున్న ఆకృత్యాలను తెలుసుకున్న భార్య ఫిర్యాదుతో విషయం బయటకు వచ్చింది. నిందితుడిని సోమవారం అరెస్ట్‌ చూపే అవకాశం ఉంది.    చదవండి:  (మామూలు కుర్రోడు.. ఇప్పుడు ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ')

(ప్రియురాలి ప్రవేశం.. మొదటిరాత్రి భగ్నం!)

(సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ప్రేమ.. కొద్ది క్షణాల్లో పెళ్లనగా..)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా