అమ్మా, నాన్నా.. మేం పోతున్నాం

11 Nov, 2020 09:23 IST|Sakshi

సాక్షి, గుంటూరు : క్రికెట్‌ బెట్టింగ్‌ కారణంగా ఓ యువకుడు ప్రాణం కోల్పోగా.. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. పెదకూరుపాడు మండలానికి చెందిన ఊర సురేష్‌, బెల్లంకొండ బుడగజంగాల కాలనీకి చెందిన కొమురయ్య ఇద్దరూ క్రికెట్‌ బెట్టింగ్‌లో లక్షల రూపాయలు పొగొట్టుకున్నారు. బెట్టింగ్‌ నిర్వాహకుడికి రూ. 30వేలు చెల్లించగా.. మరో రూ.80 వేల కోసం నిర్వాహకుడు పట్టుబట్టాడు. దీంతో బాకీలు తీర్చలేక మనస్తాపంతో బెల్లంకొండ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చదవండి: గోల్‌మాల్‌ గేమ్‌!

అంతేగాక తాము చనిపోతున్నామంటూ సెల్ఫీ వీడియో తీసి బంధువులకు పంపారు. విషయం తెలుసుకున్న బంధువులు సంఘటన స్థలానికి చేరుకొని ఇద్దరిని గుంటూరు ప్రైవేటు అస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సురేష్‌ మృతి చెందగా, కొమురయ్య పరిస్థితి విషయంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న బెల్లంకొండ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు