పెళ్లి పేరుతో ఘరానా మోసం.. పోలీసులను ఆశ్రయించిన వధువు

27 Jul, 2020 16:19 IST|Sakshi

సాక్షి, గుంటూరు: అబ్బాయికి అమెరికాలో ఉద్యోగం.. మంచి సంబంధం అని చెప్పడంతో.. కోటి కలలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆ నూతన వధువుకు మూడు రోజులకే భర్త గే అని తెలిసింది. దాంతో ఒక్కసారిగా ఆమె కలల సౌధం కూలిపోయింది. దీన్ని నుంచి ఇంకా తేరుకోని ఆ యువతికి అధిక కట్నం కావాలంటూ వేధింపులు మొదలయ్యాయి. వివాహం అయ్యి నెల రోజులు కూడా గడవక ముందే భార్య అంటే ఇష్టం లేదంటూ సదరు వ్యక్తి అమెరికా వెళ్లిపోయాడు. దాంతో యువతి పోలీసులను ఆశ్రయించింది. (ప్రేమించాడు.. పెళ్లంటే వద్దన్నాడు!)

వివరాలు.. అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పని చేస్తోన్న భాస్కర్‌ రెడ్డికి ఏటి అగ్రహారానికి చెందిన యువతితో వివాహం అయ్యింది. పెళ్లి సమయంలో యువతి తల్లిదండ్రులు యాభై సవర్ల బంగారం, యాభై లక్షల రూపాయలు కట్నంగా ఇచ్చారు. పెళ్లైన మూడు రోజులకే తాను గేనని భాస్కర్‌ రెడ్డి, భార్యకు చెప్పాడు. అంతేకాక అమెరికాలో బాయ్‌ఫ్రెండ్‌ కూడా ఉన్నాడన్నాడు. అంతటితో ఊరుకోక అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధింపులకు గురి చేశాడు. ఆ తర్వాత నెల రోజులు గడవకముందే.. భార్య అంటే ఇష్టం లేదని తేల్చి చెప్పి అమెరికా వెళ్లాడు భాస్కర్‌ రెడ్డి. వేధింపులు తట్టుకోలేక సదరు యువతి అర్బన్‌ ఎస్పీని ఆశ్రయించింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటుంది. 

మరిన్ని వార్తలు