కుక్కని కుక్కా అన్నందుకు తలలు పగలగొట్టారు..

12 May, 2021 14:41 IST|Sakshi

న్యూఢిల్లీ: కుక్కని కుక్కా అని పిలిచినందుకు చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివానలా మారింది. పెద్ద గొడవకు దారితీసింది. హర్యానాలోని గురుగ్రామ్ చెందిన జ్యోతిపార్క్‌ ప్రాంతంలో ఓ కుటుంబం టామీ అనే కుక్కని పెంచుకుంటున్నారు. ఆయితే ఆ కుక్క స్థానికుల్ని కరవడం, భయపెట్టడం చేస్తుండేది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండే సుధీర్‌ అనే వ్యక్తి కుక్కని చైన్‌కి కట‍్టేయొచ్చు కదా, మా పిల్లల్ని కరుస్తోంది అని, కుక్క యజమానిని రిక్వెస్ట్‌ చేశాడు. అంతే మా టామీని కుక్క అని పిలుస్తావా? నీకెంత ధైర్యం అంటూ దాని యజమాని, యజమాని కుటుంబ సభ్యులు సుధీర్‌ కుటుంబంపై దాడికి దిగారు. రాడ్లు,కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో సుధీర్‌ కుటుంబానికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.  

ఇదే సమయంలో ఘర్షణ జరుగుతుండగా స్థానికులు తీసిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘర్షణ అనంతరం సుధీర్‌ సదరు కుక్క యజమాని మా కుటుంబసభ్యలపై దాడి చేశాడు. ఆ కుక్క మా పిల్లల్ని కరుస్తోందని యజమానికి చెప్పా. టామీని కుక్కా అని పిలుస్తావా అని కొట్టాడంటూ పోలీసులు ఫిర్యాదు చేశాడు.  

కాగా, గురుగ‍్రామ్‌లో కుక్కల వల్ల ఘర్షణ పడ్డ సంఘటనలు గతంలో చాలానే జరిగాయని పోలీసులు చెబుతున్నారు. అందరూ కరోనా వల్ల ఇబ్బంది పడుతుంటే వీళ్లు మాత్రం కుక్క గురించి తలలు పగిలేలా కొట్టుకోవడం ఏమిటోనని గురుగ్రామ్‌ పోలీసులు నిట్టూరుస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ ఘర్షణపై తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. అరె ఏంట్రా ఇది..కుక్కని కుక్కా అని పిలవకూడదా? అంత మాత్రనికే తలలు పగలగొట్టాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు