గో కార్టింగ్ సీజ్, ‌నిర్వాహకులు అరెస్ట్‌

9 Oct, 2020 20:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  గుర్రంగూడలోని హాస్టన్‌ గో కార్టింగ్ నిర్వాహకులను మీర్‌పేట పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. సంబంధిత శాఖల నుంచి అనుమతి లేకుండానే గో కార్టింగ్‌ నిర్వహిస్తున్నారని, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే సందర్శకులను అనుమతి ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సంస్థ నిర్వహాకులు గుర్రం లోహిత్‌ రెడ్డి, కిరణ్‌ కుమార్‌, శ్రీకాంత్‌ను అరెస్ట్‌ చేసి గో కార్టింగ్‌ సెంటర్‌ను సీజ్‌ చేశారు. కాగా వ‌న‌స్థ‌లిపురంలోని ఎఫ్‌సీఐ కాల‌నీకి చెందిన శ్రీ వ‌ర్షిణి అనే యువ‌తి గో కార్టింగ్‌ చేస్తూ మృతి చెందిన విషయం తెలిసిందే. నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె మృతి చెందిందంటూ ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  గో కార్టింగ్‌ నిర్వాహకులపై  ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు శ్రీ వర్షిణి మృతదేహానికి ఆమె కుటుంబ సభ్యులు శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించారు. (గో కార్టింగ్‌ ప్రమాదంలో శ్రీ వర్షిణి మృతి)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా