దొంగోడి అవతారమెత్తిన మహిళా హెడ్‌ కానిస్టేబుల్‌..!

2 Aug, 2021 16:28 IST|Sakshi

సీజ్‌ చేసిన వాహనాలు మాయం!

ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బండి కాగితాలు ఏది లేకున్నా.. ఫైన్‌ కట్టు లేదా బండిని సీజ్‌ చేస్తామంటారు పోలీసులు. తర్వాత సీన్‌ సీజ్‌ చేసిన బండికి రక్షణ.. గాల్లో దీపం పెట్టి.. దేవుడా నీవే దిక్కు అన్న చందంగా తయారవుతుందనేది తెలిసిన సంగతే. 

ముంబై: మహారాష్ట్రలోని వసాయి పోలీస్‌ స్టేషన్‌లో స్టోర్‌ క్లర్క్‌గా పని చేస్తున్న మహిళా హెడ్ కానిస్టేబుల్ మంగళ్ గైక్వాడ్‌ సీజ్‌ చేసిన వాహనాలను అమ్ముకుంటూ పట్టుపడింది. దీనికి సంబంధించి వసాయి పోలీసులు ఆమెకు నోటీసులు పంపించారు. వివరాల్లోకి వెళితే..  మహిళా హెడ్ కానిస్టేబుల్ మంగళ్ గైక్వాడ్‌ వసాయి పోలీస్‌ స్టేషన్‌లో స్టోర్‌ క్లర్క్‌గా పని చేస్తోంది. అయితే వివిధ కారణాలపై సీజ్‌ చేసిన వాహనాలను, వస్తువులను, నగదుకు సంబంధించి వివరాలు నమోదు చేసుకోవడం ఆమె బాధ్యత.

కానీ ఓ డీలర్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఏకంగా వాహనాలను, వస్తువులను భేరానికి పెట్టి విక్రయిస్తోంది. ఈ విషయంపై పలు ఆరోపణలు రావడంతో పోలీసులు రెక్కీ నిర్వహించి, స్క్రాప్ డీలర్ ముస్తాక్‌కు విక్రయించే సమయంలో గైక్వాడ్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాదాపు ఇప్పటి వరకు రూ. 26 లక్షల విలువైన వస్తువులను దొంగిలించినట్లు పోలీసులు తెలిపారు. స్క్రాప్ డీలర్‌ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. కాగా ఈ ఆరోపణలపై మార్చి 12న హెడ్‌ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసి విచారణ చేపట్టారు. ఆమెపై వసాయి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సీనియర్‌ పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ కళ్యాణ్‌ కార్పే తెలిపారు. 

మరిన్ని వార్తలు