1,744 కిలోల గంజాయి స్వాధీనం

22 Apr, 2021 04:16 IST|Sakshi

పాడేరులో 1,200 కిలోలు, మర్రిబంద వద్ద 544 కిలోలు పట్టివేత

పాడేరు: విశాఖ జిల్లాలో బుధవారం భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పాడేరులో 1,200 కిలోలు, మర్రిబంద వద్ద 544 కిలోలు పట్టుకున్నారు. వ్యాన్‌లో పసుపు బస్తాల మాటున తరలిస్తున్న 1,200 కిలోల గంజాయిని పాడేరు పాత బస్టాండ్‌ వద్ద అంబేడ్కర్‌ సెంటర్‌లో  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు ప్రాంతం నుంచి పసుపు లోడుతో వస్తున్న వ్యాన్‌ను తనిఖీ చేయగా పసుపు బస్తాల కింద గంజాయి బస్తాలున్నట్లు గుర్తించారు.

గంజాయిని స్వాధీనం చేసుకుని డ్రైవర్, క్లీనర్‌తో పాటు మరో గిరిజనుడిని అరెస్టు చేశారు. ఈ గంజాయి విలువ రూ.36 లక్షలు ఉంటుందని ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. యలమంచిలి మండలం మర్రిబంద వద్ద 544 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు సీఐ వి.నారాయణరావు తెలిపారు. దీన్ని తరలిస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 

మరిన్ని వార్తలు