హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత

26 Feb, 2022 13:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. డ్రగ్స్‌ సరాఫరా చేస్తున్న ఓ నైజీరియన్‌తోపాటు 12 మందిని హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం పోలీసులు అరెస్ట్‌ చేశారు. అలాగే డ్రగ్స్‌ సేవిస్తున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఎమ్‌డీఎమ్‌ఏ, ఎల్‌ఎస్‌డీ బ్లాట్‌లతో పాటు గంజాయి, హ్యాష్‌ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఆర్‌ నగర్‌, కార్ఖానా, సికింద్రాబాద్‌లో ముఠాగా ఏర్పడి డ్రగ్స్‌ అమ్ముతున్నట్లు పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను బషీర్ బాగ్ సీపీ కార్యాలయంలో కమిషనర్ సీవీ ఆనంద్ మీడియా సమావేశంలో వెల్లడించనున్నారు.
చదవండి: సీబీఐ మరో కట్టుకథ: చంపుతుంటే.. పడుకున్నాడు! 

మరిన్ని వార్తలు