కర్నూలులో భారీగా బంగారం పట్టివేత

11 Jul, 2021 11:20 IST|Sakshi

సాక్షి, కర్నూలు: పంచలింగాల చెక్‌పోస్ట్ వద్ద భారీగా బంగారం పట్టుబడింది. కర్నూలు ఎస్ఈబీ అధికారులు చేపట్టిన తనిఖీల్లో రూ.3కోట్ల విలువైన 7 కేజీల బంగారం, రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా వీటిని తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. కారులో నగదు, బంగారాన్ని హైదరాబాద్ నుండి బెంగళూరుకి తరలిస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులు గుర్తించారు.

>
మరిన్ని వార్తలు