Tamil Nadu Crime: హిజ్రాలతో చీకటి ప్రదేశానికి వెళ్లిన వంటమాస్టర్‌.. చివరికి ట్విస్ట్‌

13 Jul, 2022 09:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

తిరువొత్తియూరు(తమిళనాడు): పుదుకొట్టై జిల్లాలో ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న వ్యక్తి దారుణంగా హత్యకు గురయ్యాడు. సంబంధించి ఐదుగురు హిజ్రాలను పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. పుదుకొట్టై జిల్లా పొన్‌అమరావతి ఆలవాయిల్‌ ప్రాంతానికి చెందిన ధర్మలింగం (45) తుడియలూర్‌ బస్‌స్టాప్‌ సమీపంలోని ఓ హోటల్‌లో వంట మాస్టర్‌గా పని చేస్తున్నాడు. 8వ తేదీ తీవ్రగాయాలతో కోవై ప్రభుత్వాస్పత్రిలో చేరాడు. ఈ క్రమంలో తొమ్మిదో తేదీ రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ ధర్మలింగం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి: అనంతసేనుడి అశ్లీల బాగోతం.. మహిళలకు మంత్ర శక్తుల పేరిట వల 

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టులో చొక్కలింగం కడుపుపై దాడిచేయడంతో మృతి చెందినట్లు తేలింది. దీంతో పెరియనాయకన్‌ పాలయం డీఎస్పీ రాజపాండియన్‌ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విచారణలో హిజ్రాలు అతనిపై దాడి చేసి హత్య చేసినట్లు గుర్తించారు. సంఘటన జరిగిన రోజున రాత్రి తుడియలూర్‌ సమీపంలో రోడ్డు పక్కన నిలబడి ఉన్న హిజ్రాల్లో ఒకరు ధర్మలింగంను ఉల్లాసం కోసం చీకటి ప్రదేశానికి తీసుకెళ్లారు.

అక్కడ వాగ్వాదం జరగడంతో మరో నలుగురు హిజ్రాలు అక్కడికి చేరుకుని అతనిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ధర్మలింగం చికి త్స పొందుతూ మృతిచెందాడు. దీనిపై హత్య కేసు నమోదు చేసి పోలీసులు.. గౌండంపాళ్యం మారియమ్మన్‌ ఆలయ వీధికి చెందిన హిజ్రాలు రషి్మక (26), అరునిక (24), గౌతమి (20), రూబి (26), మమత (22)ను అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.  

మరిన్ని వార్తలు