హైదరాబాద్‌లో హిజ్రాల హల్‌చల్‌.. డబ్బులు డిమాండ్‌.. ఆపై!

17 Jun, 2021 17:30 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: నేరేడ్‌మెట్‌ ప్రాంతంలో కొందరు హిజ్రాలు హల్‌చల్‌ చేశారు. స్థానికంగా పెళ్లి జరుగుతున్నఇంట్లోకి ప్రవేశించి ఏకంగా 50 వేల రూపాయలు డిమాండ్‌ చేశారు. అంత మొత్తంలో డబ్బులు పెళ్లి వారు ఇవ్వకపోవడంతో వారితో అసభ్యంగా ప్రవర్తించారు. డబ్బులు ఇవ్వాల్సిందేనని బట్టలు విప్పి హిజ్రాలు నానా హంగామా చేశారు. అంతటితో ఆగకుండా పెళ్లి వారిపై దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

దీంతో బాధితులు పోలీసులకు సమాచారమివ్వగా.. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు హిజ్రాలను అదుపులోకి తీసుకొని నేరేడ్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే హిజ్రాలు పోలీస్‌ స్టేషన్‌లో సైతం బట్టలు విప్పి ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడంతో వారిపై 506, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. స్టేషన్‌లో హంగామా చేసినందుకు ఐపీసీ 188, 51 (బి) డిజాస్టర్‌ మేనెజ్‌మెంట్‌ కింద మరో కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు