హైటెక్ వ్యభిచారం.. తప్పించుకోవడానికి రహస్య మార్గం..

22 Sep, 2021 08:50 IST|Sakshi

సాక్షి, తుమకూరు(కర్ణాటక): తుమకూరు సమీపంలో ఉన్న క్యాత్సంద్రలోని ఒక లాడ్జిలో గుట్టుగా వ్యభిచారం  వేశ్య వాటిక గుట్టు రట్టయింది. పోలీసులు దాడి చేసి కోల్‌కతాకు చెందిన ఐదు మంది యువతులను రక్షించి, ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. ఎస్పీ రాహుల్‌ కుమార్‌ శహాపురవాడ్‌ వేశ్య వాటికను సందర్శించారు. తప్పించుకోవడానికి నిర్వాహకులు డ్రెస్సింగ్‌ టేబుల్‌ కింద ఏర్పాటు చేసుకున్న రహస్య ద్వారాన్ని చూసి ఆశ్చర్యపోయారు.   

వేధింపుల నేరగాడు అరెస్టు 
బనశంకరి: ఇన్‌స్టాగ్రామ్‌లోని అమ్మాయిల ఫొటోలను తీసుకుని అశ్లీలంగా మార్ఫింగ్‌ చేస్తున్న కలబుర్గివాసిని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు ఆగ్నేయ విభాగ డీసీపీ శ్రీనాథ్‌ జోషి మాట్లాడుతూ ఇన్‌స్టాలో గుడ్‌బాయ్‌ బ్యాడ్‌ట్రోల్‌ అనే పేజీని ఒక యువకుడు ఏర్పాటు చేశాడు. ఐటీఐ చదివిన ఇతడు రెండేళ్ల పాటు బెంగళూరులో ఎలక్ట్రీషియన్‌గా పనిచేశాడు.

కరోనా లాక్‌డౌన్‌ తరువాత సొంతూరు కలబురిగికి వెళ్లిపోయాడు. అమ్మాయిల ఫొటోలను అశ్లీలంగా మార్చి వారికి పంపుతూ పైశాచికానందాన్ని పొందేవాడు. దీనిపై ఫిర్యాదులు రావడంతో సీఐ మునిరెడ్డి మొబైల్‌ నెట్‌వర్క్‌ ఆధారంగా అతని ఆచూకీని గుర్తించి కలబురిగిలో మంగళవారం అరెస్టు చేసినట్లు చెప్పారు. ఇతనికి సహకరించిన మరొకరు పరారీలో ఉన్నారు. 

చదవండి: రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం.. బంగారం ఇ‍వ్వడం ఆలస్యమైందని..

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు