మహిళతో హనీట్రాప్‌.. నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించి

27 Jul, 2021 10:05 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మండ్య(కర్ణాటక): హనీట్రాప్‌ చేసి రూ.30 వేలను దోచేసిన మహిళతో పాటు మొత్తం ఐదుగురిని మండ్య గ్రామీణ పోలీసులు అరెస్టు చేశారు. గుత్తలు రోడ్డులో ఉన్న రవిచంద్ర, కార్తీక్, కిరణ్, చెన్నపట్టణకు చెందిన మంజు కలిసి బాధిత వ్యక్తికి ఒక మహిళను పరిచయం చేశారు. ఆమెతో నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించి డబ్బులను దోచుకెళ్లారు. జూన్‌ 22న గిరీశ్‌ అనే వ్యక్తి నుంచి కూడా ఇదే విధంగా నగదు. మొబైల్, బైక్‌ లాక్కుని పరారీ అయ్యారు. డీఎస్పీ మంజునాథ్, సీఐ ఆనందగౌడ నేతృత్వంలోని బృందం గాలింపు జరిపి మండ్య నగరంలో ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు

 ఏఎస్‌ రాలేదని ఆత్మహత్య 
దొడ్డబళ్లాపురం: కేఏఎస్‌ లో అర్హత సాధించలేదనే  మనస్తాపంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన నెలమంగల పట్టణంలో చోటుచేసుకుంది. నెలమంగల పట్టణంలోని విజయనగర్‌ కాలనీలో నివసిస్తున్న లచ్చిరెడ్డి భార్య మీనా ఆత్మహత్య చేసుకుంది. ఈమె స్థానిక కళాశాలలో కన్నడ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తోంది. డబుల్‌ గ్రాడ్యుయేట్‌ కావడం గమనార్హం. కేఎఎస్‌ పరీక్షలు రాసిన మీనా ఫెయిలయ్యింది. దీంతో తీవ్ర మనస్తాపం చెంది ఇంటిపైన ఉన్న షెడ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెలమంగల పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు