వలపు వల.. వేశ్యా వాటికకు పిలిపించి.. 

29 Oct, 2020 06:35 IST|Sakshi
అరెస్టు అయిన హనీట్రాప్‌ ముఠా సభ్యులు

నగరంలో హనీట్రాప్‌ ముఠా అరెస్టు

వేశ్యావాటికకు పిలిపించి బెదిరింపులు   

కృష్ణరాజపురం (బెంగుళూరు): అమ్మాయిలను వల వేసి డబ్బు దండుకుంటూ దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు ముఠాను మహదేవపుర పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు అంజలి, దీపక్, టైసన్, ప్రేమనాథ్, వినోద్, ప్రకాశ్, ఈశ్వరి తదితరులు ధనవంతులను లక్ష్యంగా చేసుకుని హనీట్రాప్‌కు పాల్పడుతున్నారు. ఈ లేఔట్‌లో ఒక వేశ్యావాటికను అడ్డాగా చేసుకుని ఈ హనీట్రాప్‌ను నడిపిస్తున్నారు. సోషల్‌ మీడియా, మొబైల్‌ ద్వారా కస్టమర్లను ఆహ్వానిస్తారు. ఆ తర్వాత వారి మాటలు నమ్మి వచ్చిన వారి వీడియోలను చిత్రీకరించి భయపెడతారు.

సదరు వ్యక్తి ఇంట్లోకి రాగానే యువతి భర్త, ఇతర స్నేహితులు లోపలికి వచ్చి హైడ్రామా సాగిస్తారు. డబ్బులను ఇవ్వాలని లేదంటే వీడియోలను బయట బహిర్గతం చేస్తామని బెదిరిస్తారు. ఈ విషయం బయటకు వచ్చిదంటే మారణాయుధాలను చూపించి చంపేస్తామని కూడా బెదిరింపులకు గురిచేస్తారు. ఇలాంటి ఘటనపై ఇటీవల ఫిర్యాదులు అందుతుండడంతో మహదేవపుర పోలీసులు రెక్కీ నిర్వహించి ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి కొన్ని అశ్లీల వీడియోలు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు