ప్రేమ జంట దారుణ హత్య.. పరువు పోతుందని అమ్మాయి కుటుంబసభ్యులే..

30 Aug, 2022 08:33 IST|Sakshi

బస్తీ(ఉత్తరప్రదేశ్‌): పరువు హత్యకు మరో ప్రేమ జంట బలైంది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని పదారియా చేట్‌సింగ్‌ గ్రామంలో ఈ దారుణం జరిగింది. వేరే మతం వ్యక్తిని ఇష్టపడిందని అమ్మాయి కుటుంబ సభ్యులే ఈ జంటను హతమార్చారని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముజిబుల్లా వద్ద ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేసే 18 ఏళ్ల దళిత టీనేజర్‌ అంకిత్‌.. ముజిబుల్లా కూతురు అమీనాను ప్రేమించాడు. ప్రేమ వ్యవహారం ఇష్టంలేని అమీనా తండ్రి ముజిబుల్లా కూతురిని వారించాడు. ఎంతకీ వినకపోవడంతో అంకిత్‌ను, అమీనాను హతమార్చారు. రుధౌలీ ప్రాంతంలోని చెరకు తోటలో అమీనాను పాతిపెట్టారు. అంకిత్‌ మృతదేహాన్ని గుర్తించిన పరాస్‌నాథ్‌ చౌదరి పోలీసులకు సమాచారమిచ్చారు.
చదవండి: కాళ్ల పారాణి ఆరకముందే.. వరుడు దుర్మరణం, వధువుకు తీవ్ర గాయాలు

మరిన్ని వార్తలు