కోరిక తీర్చమన్నారు.. విషయం సీఎంకు చేరింది!

24 Jun, 2021 13:54 IST|Sakshi

జామ్‌నగర్: గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో  ఓ ప్రభుత్వ ఆసుపత్రి హెచ్‌ఆర్ మేనేజర్‌, సూపర్‌వైజర్‌ను లైంగిక వేధింపుల కేసులో పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మహిళా అటెండెంట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ నితేశ్‌ పాండే తెలిపారు. ఈ విషయం తెలిసిన గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే.. కొంతమంది కాంట్రాక్టు మహిళా అటెండెంట్లు తమపై కొందరు ఉన్నతాధికారులు లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. వారి కోరికను తిరస్కరించిన ​కొందరు మహిళా అటెండెంట్లను జూన్‌ 16న విధుల నుంచి  తొలిగించినట్లు పేర్కొన్నారు. వార్డ్‌ బాయ్స్‌ ద్వారా తమకు ఈ ప్రతిపాదనలు చేయిస్తున్నారని అన్నారు. వారి కోరికను తిరస్కరించిన వారికి మూడు నెలలుగా జీతం చెల్లించకుండా తొలగించారని వివరించారు.  

కాగా దీనిపై జామ్‌ నగర్‌ బి డివిజన్‌ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇక నిందితులపై భారతీయ శిక్షాస్మృతి 354, 354-ఎ, 354-బి, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసుపై మరింత దర్యాప్తు జరుగుతోందని అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ నితీశ్‌ పాండే అన్నారు. ఇక ఈ ఆరోపణలపై సమగ్ర నివేదికను మూడు రోజుల్లోగా సమర్పించాలని గుజరాత్ రాష్ట్ర మహిళా కమిషన్ జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌ను కోరింది.

చదవండి: భారత్‌ బయోటెక్‌ కోవాగ్జిన్‌కు మరోసారి చుక్కెదురు

మరిన్ని వార్తలు