పెళ్లిపీటలు ఎక్కాల్సిన సమయంలో.. స్నానానికి వెళ్లిన వధువు తిరిగి రాకపోవడంతో.

9 Sep, 2022 08:42 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: కన్యాకుమారి జిల్లా ఇరానియల్‌ సమీపంలోని బ్లాక్‌ కోడ్‌ పొట్రారై కాలనీకి చెందిన సుకుమార్‌ (63) కుమార్తె గాయత్రీదేవి (23) బెంగళూరులో ఉన్న ఒక ఐఏఎస్‌ అకాడమీలో చదువుతోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు గాయత్రీదేవికి ఇదే ప్రాంతానికి చెందిన ఒక యువకుడితో వివాహం నిశ్చయించారు. గురువారం ఉదయం వివాహం జరగాల్సి ఉండగా ఇరు కుటుంబాల వారు బుధవారం ఉదయం వధువు ఇంటికి చేరుకున్నారు.

స్నానానికి ఇంటిపైకి వెళ్లిన గాయత్రీదేవి ఎంతసేపటికీ రాకపోవడంతో సందేహపడిన బంధువులు తలుపు తట్టారు. ఎంతకీ తీయకపోవడంతో తలుపులు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని శవమై వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే గాయత్రీదేవి మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆత్మహత్యకు కారణం ఏమిటనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.  
చదవండి: తల్లి రుణం తీర్చుకోవడానికి ఓ తనయుడి కష్టాలు

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com  

మరిన్ని వార్తలు