కాళ్లు చేతులు కట్టేసి.. నోట్లో చీర కొంగు కుక్కి.. కేబుల్‌తో ఉరేసి.. 

25 Jun, 2021 12:58 IST|Sakshi

కిరాయిదారుడి చేతిలో ఇంటి యజమానురాలి దారుణ హత్య

నల్లాలు పని చేయడం లేదని పిలిచి ఘాతుకం

మృతురాలి గాజులు అమ్మి అప్పులు తీర్చుకున్న వైనం

సాక్షి, అల్వాల్‌: నల్లాలు పని చేయడం లేదని ఇంట్లోకి పిలిచి ఇంటి యజమానురాలిని చార్జింగ్‌ కేబుల్‌తో కాళ్లు చేతులు కట్టేసి నోట్లో చీర కొంగు కుక్కి ల్యాప్‌టాప్‌ కేబుల్‌ను గొంతుకు బిగించి దారుణంగా హత్య చేసిన సంఘటన అల్వాల్‌  పరిధిలో గురువారం వెలుగులోకి వచి్చంది.  పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కానాజీగూడ సత్యసాయి కాలనీకి చెందిన మంగతాయారు(75) కుమారుల్లో ఒకరు ఆర్మీలో కల్నల్‌గా పనిచేస్తుండగా, మరొకరు అమెరికాలో ఉంటున్నారు. కుమార్తె ఆమె ఇంటికి సమీపంలోనే ఉంటోంది. మంగతాయారు కుమారుడు ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో సమీపంలో ఉన్న సోదరికి ఫోన్‌ చేశాడు. కుమార్తె  ఇంటికి వెళ్లి చూడగా తాళం వేసి ఉండటంతో చుట్టు పక్కల వాకాబు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

పోలీసులు మంగతాయారు ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో మూడో అంతస్తులో అద్దెకు ఉంటున్న రాజేష్‌ను ప్రశి్నంచగా ముక్తసరిగా సమాధానం చెప్పి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. దీంతో అనుమానం వచి్చన పోలీసులు అతడి ఇంట్లో గాలించగా బాత్‌రూమ్‌లో మంగతాయారు కాళ్లు చేతులు కట్టి పడేసి విగతజీవిగా పడిఉంది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పని చేస్తున్న రాజేష్‌కు గతంలో పలుమార్లు భార్యతో గొడవలు జరిగాయి. ఈ క్రమంలో మంగతాయారు జోక్యం చేసుకొని అతడిని మందలించిందని తెలిసింది.

అయితే 10 రోజుల క్రితం అతడి భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతోపాటు రాజేష్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన రాజేష్‌ బుధవారం మధ్యాహ్నం ఇంటి టెర్రస్‌ పై మొక్కలు చూసేందుకు వెళ్తున్న మంగతయారును నల్లాలు పనిచేయడం లేదని ఇంట్లోకి పిలిచి ల్యాప్‌టాప్‌ కేబుల్‌ వైర్‌ గొంతుకు బిగించి దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని బాత్‌రూంలో పారవేశాడు. అనంతరం ఆమె చేతికి ఉన్న నాలుగు బంగారు గాజులను తీసుకొని వెళ్లి ప్రైవేటు ఫైనాన్స్‌లో కుదువపెట్టి డబ్బులు తీసుకొని అప్పులు  తీర్చుకున్నాడు. రాత్రి వరకు ఏమీ తెలియనట్లు ఇంట్లోనే ఉన్నాడు. డబ్బుల కోసమే వృద్ధురాలిని హత్య చేశాడా మరేదైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: 
మణప్పురం సంస్థకు రూ.30 లక్షలు టోకరా 

మాజీ కార్పొరేటర్‌ దారుణ హత్య.. ఖండించిన సీఎం

మరిన్ని వార్తలు