గంజాయి గుట్టురట్టు 

7 Sep, 2021 14:13 IST|Sakshi

ఇచ్ఛాపురం(శ్రీకాకుళం): ఇచ్ఛాపురం పోలీసు లు మరోసారి శభాష్‌ అనిపించుకున్నారు. కోటి విలువైన గంజాయి రవాణాను అడ్డుకుని ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. బొగ్గు మాటున గంజాయిని ఉంచి తీసుకెళ్లిపోదామనుకున్న వారి ప్రయత్నాలకు గండి కొట్టారు. ఇచ్ఛాపురం పాత జాతీయ రహదారిలో సోమవారం 1050 కేజీల గంజాయి ని పోలీసులు స్వాధీనం చేసుకున్నా రు. ఎస్పీ అమిత్‌ బర్దార్‌ సోమవా రం తెలిపిన వివరాల మేరకు.. విశాఖ జిల్లా పెందుర్తి–ఆనందపురం మధ్య బొగ్గును జార్ఖండ్‌లోని రాంఛీకి తీసుకెళ్లే హెచ్‌ఆర్‌ 63సి 9751 నంబర్‌ గల లారీ సో మవారం జాతీయ రహదారి గుండా బయల్దేరింది. బొగ్గుతో పాటు 210 ప్యాకెట్ల గంజాయిని ఈ లారీలోనే ఉంచి రవాణా చేసేందుకు కొందరు ప్రయత్నించారు.

అందుకు పాత జాతీయ రహదారిని మార్గంగా ఎంచుకున్నారు. అయితే దీనిపై ఇచ్ఛాపురం పోలీసులకు లీ లగా సమాచారం అందడంతో వా రు బెల్లుపడ పాత టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. అదే దారిలో బొగ్గు లారీ కూడా రావడంతో ఆపి బండిని నిశితంగా పరిశీ లించారు. దీంతో లారీలోని 210 ప్యాకెట్లలో గల 1050 కిలోల గంజాయి బయటపడింది. గంజాయి అక్రమ రవాణాలో ఏడుగురు ఉ న్నట్లు పోలీసులు గుర్తించారు. వీ రిలో స్థానికుల పాత్ర కూడా ఉంద ని సమాచారం. లారీని పట్టుకున్న సమయంలో లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్, మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. ఇంకొకరు పరారైపోయారు. మిగిలిన ముగ్గురిని కూడా అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. గంజాయి విలువ కోటి ఐదు లక్షల రూపాయలు ఉంటుందని ఆయన చెప్పారు. గంజాయిని పట్టుకున్న పట్టణ పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.  ఇందులో కాశీబుగ్గ డీఎస్పీ ఎం.శివరా మిరెడ్డి, సీఐ ఎం.వినోద్‌బాబు, పట్టణ, రూరల్‌ ఎస్‌ఐలు వి.సత్యనారాయణ, బి.హైమావతి పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు