బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు.. కుప్పకూలిన భవనాలు.. ఐదుగురు మృతి

10 Nov, 2022 16:14 IST|Sakshi

సాక్షి, తమిళనాడు: మదురైలోని తిరుమంగళం సమీపంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. అగుజైలు గ్రామంలో బాణాసంచా ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో ఐదుగురు మృతి చెందగా,15మందికి గాయపడ్డారు.

వీపీఎం బాణాసంచా కర్మాగారంలోని మూడు భవనాల్లో వల్లరసు అనే కార్మికుడితో సహా నలుగురు పురుషులు, ఒక మహిళ పనిచేస్తుండగా ఒక్కసారిగా భవనంలో పటాకులు పేలి మూడు భవనాలు కూలిపోయాయి.  ఈ ప్రమాదంలో అమ్మాసి, వల్లరసు, గోబి, విక్కీ, ప్రేమ ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: భార్యాభర్తల మధ్య బిర్యానీ పంచాయితీ.. తనకూ కావాలని అడిగినందుకు

మరిన్ని వార్తలు