ఇంటి వరండాలో అస్థి పంజరం.. ఒక్కసారిగా షాక్‌..

7 Aug, 2021 07:23 IST|Sakshi

తిరువొత్తియూరు (తమిళనాడు): చెన్నై అమింజికరైలో చాలా రోజులుగా తాళం వేసి ఉన్న ఇంటిలో అస్థిపంజరం బయటపడింది. రైల్వే కాలనీ 3వ వీధికి చెందిన మహేష్‌ (45)కు అదే ప్రాంతంలో సొంత ఇల్లు ఉంది. అది శిథిలం కావడంతో తాళం వేశారు. శుక్రవారం ఇంటిని శుభ్రం చేయడానికి తాళం తీశారు. ఆ ఇంటి వరండాలో అస్థిపంజరం ఉండడాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు.

ఇన్‌స్పెక్టర్‌ కృపానిధి విచారణ చేపట్టారు. మృతి చెందిన వ్యక్తి మహేష్‌ అన్న రమేష్‌ (49)గా తేలింది. రమేష్‌ కారు డ్రైవర్‌ అని, అతనికి పెళ్లి కాకపోవడంతో ఆ ఇంటిలో ఒంటరిగా ఉన్నట్టు గుర్తించారు. ఎముకల గూటిని ఫోరెన్సిక్‌ పరీక్ష కోసం ల్యాబ్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు