కన్నతల్లీ కర్కోటకురాలు 

18 Sep, 2022 08:35 IST|Sakshi

మండ్య: మానవత్వం లేని మహిళ అప్పుడే పుట్టిన నవజాత శిశువు (మగ)ను 30 అడుగుల లోతులో ఉన్న పాడుబడిన బావిలో పారవేసిన దారుణ ఘటన జిల్లాలోని పాండవపుర తాలూకా చంద్రె గ్రామంలో చోటు చేసుకుంది.  శనివారం ఉదయం శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని శిశువును సంరక్షించారు.

అనంతరం పాండవపుర పట్టణ ఆస్పత్రికి తరలించగా అక్కడ ఉన్న ఓ మహిళ చనుబాలు ఇచ్చి అమ్మతనం చాటుకుంది. శిశువును చీమలు కరవడంతో మెరుగైన చికిత్స కోసం మండ్య మిమ్స్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి గోపాలయ్య మిమ్స్‌ ఆస్పత్రికి చేరుకుని శిశువును పరిశీలించి ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. ఉత్తమ వైద్యం అందివ్వాలని జిల్లా అధికారి అశ్వతికి సూచించారు. 

(చదవండి: ఆడపిల్లను కన్నావు... అదనపు కట్నం తెస్తేనే సంసారం)

మరిన్ని వార్తలు