ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త అలా చేస్తున్నాడని వందన..

4 May, 2022 08:28 IST|Sakshi

దొడ్డబళ్లాపురం: మత్తు పదార్థాలకు బానిసైన భర్త వేధింపులను తాళలేక భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొడ్డ పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని త్యాగరాజనగర్‌లో చోటుచేసుకుంది. కోర్టు రోడ్డులో నివసిస్తున్న గౌతమ్‌ (28), వందన (24)ను ఒకటిన్నర ఏడాది క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నాడు. 

​​కాగా, వందనా అమెజాన్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, గౌతమ్‌ సిమెంటు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. వీరిది కులాంతర వివాహం కావడంతో అత్తగారింట్లో వేధింపులు మొదలయ్యాయి. భర్త మత్తు పదార్థాలకు బానిసై వేధించేవాడు. దీంతో విసిగిపోయిన వందనా రెండు నెలల క్రితం భర్తను తీసుకుని పుట్టింటికి వచ్చేసింది. కానీ భర్తలో మార్పు రాలేదు. మంగళవారంనాడు ఇంట్లో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దొడ్డ పట్టణ పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. 

ఇది కూడా చదవండి: హైదరాబాద్‌ శివారులో నగ్నంగా మృతదేహాలు, వివాహేతర సంబంధమే కారణమా?

మరిన్ని వార్తలు