భార్య సహా ముగ్గురిపై యాసిడ్‌ దాడి 

29 Jun, 2021 06:54 IST|Sakshi

భర్త కోసం పోలీసుల గాలింపు 

టీ.నగర్‌: భార్య సహా ముగ్గురిపై యాసిడ్‌ దాడి చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. తూత్తుకుడి అశోక్‌నగర్‌కు చెందిన రవి (50). సిప్కాట్‌లో లారీ వాటర్‌ సర్వీస్‌ నడుపుతున్నాడు. ఇతని భార్య మాల (49). ఈమెకు తూత్తుకుడి పీఅండ్‌టీ కాలనీకి చెందిన సూసై (48)తో పరిచయం ఏర్పడింది. దీంతో అనుమానించిన రవి ఇరువురిని మందలించాడు. ఇదిలావుండగా ఆదివారం రాత్రి సూసై అతని కుమారుడు కెల్విన్‌ (19) మాలను చూసేందుకు వచ్చారు.

ఆ సమయంలో అక్కడికి వచ్చిన రవి ఆగ్రహంతో వారితో తగాదా పడ్డాడు. ఇంట్లో ఉన్న యాసిడ్‌ తీసుకుని మాల, సూసైపై పోసి పారిపోయాడు. అడ్డుకున్న కెల్విన్‌పై కూడా యాసిడ్‌ పడింది. సూసై, కెల్విన్‌ తీవ్రగాయాలతో నెల్లై ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మాలా మదురై ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. తూత్తుకుడి సిప్కాట్‌ పోలీసులు రవిపై ఈమేరకు కేసు నమోదు చేసి.. అతని కోసం గాలింపు చేపట్టారు.
చదవండి: కర్రతో తీవ్రంగా కొట్టడంతో ఇద్దరు చిన్నారుల మృతి

మరిన్ని వార్తలు