కర్కోటక భర్త అరెస్టు

29 Jun, 2022 08:44 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: చిత్రదుర్గ జిల్లాలో 17 ఏళ్ల బాలికపై భర్త, ముగ్గురు స్నేహితులతో కలిసి అత్యాచారానికి ఒడిగట్టారు. ఏడాది క్రితం బాలికను బెదిరించి ఇర్ఫాన్‌ అనే వ్యక్తి వివాహం చేసుకున్నాడు. శీలాన్ని శంకిస్తూ వేధిస్తూ ఉండేవాడు. జూన్‌ 7న చిత్రదుర్గ శివార్లకు వెంట తీసుకెళ్లాడు. ముందుగానే స్నేహితులను అక్కడకు పిలిపించాడు. మూకుమ్మడిగా బాలికపై దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇన్నిరోజులూ తనలో తానే కుమిలిపోతూ ఉంది. ఆమె బంధువులు తెలుసుకుని మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఇర్ఫాన్‌తో పాటు మరొకరిని మంగళవారం అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు.

భార్య దారుణ హత్య 
మైసూరు: వరుణ వద్ద చట్టనహళ్ళి గ్రామంలో పుట్టమ్మ (40) అనే మహిళను భర్త దేవరాజు హత్య చేశాడు. 21 ఏళ్ల కిందట వీరికి పెళ్లయింది. వీరికి 20 ఏళ్ల కూతురుంది. భార్యపై అనుమానంతో తరచూ గొడవ పడేవాడు. ఈ నేపథ్యంలో భార్యను కత్తితో గొంతు కోసి చంపి తల, మొండెంని వేరు చేసి పరారయ్యాడు. ఇతడు మొదటి భార్యపై కూడా గతంలో హత్యాయత్నానికి పాల్పడి జైలుకు వెళ్లివచ్చాడు. దేవరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

(చదవండి: పెళ్లయిన కొత్తలో విడిపోయి.. 52 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు!)

మరిన్ని వార్తలు