భార్యను కత్తితో నరికి.. భర్త ఆత్మహత్య

3 Mar, 2021 22:17 IST|Sakshi

సాక్షి, ఖమ్మం: తల్లాడ మండలం రంగంబంజర్ గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను కత్తితో నరికి చంపి అనంతరం తాను పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగంబంజర్ గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర రావు (65) తన భార్య సంక్రాంతి విజయలక్ష్మిని కత్తితో నరికి చంపాడు. తర్వాత తాను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న విజయ లక్ష్మీ మృతదేహం, భర్త సుబ్రహ్మణ్యేశ్వర రావు మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మర్టంకు తరలించారు. ఈ మృతులకు దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఒక కూతురు విదేశంలో ఉంటుండగా మరో కూతురు రామగుండంలో జాబ్ చేస్తోందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసకున్న పోలీసలు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

చదవండి: గొంతు నులిమి చంపాలనుకున్నాడు.. కానీ

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు