భార్య చికెన్‌ ఫ్రై వండలేదని భర్త నిరాశ.. తట్టుకోలేక..

24 Aug, 2021 20:29 IST|Sakshi

బెంగళూరు: క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి దారుణాలకు పాల్పడుతుంటారు. తాజాగా ఓ వ్యక్తి భార్య చికెన్‌ ఫ్రై వండలేదని ఆగ్రహంతో ఆమెను ఓ చెక్కతో బలంగా కొట్టగా తీవ్ర గాయాలపాలై ఆమె మృతి చెందింది. ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులో నివసిస్తున్న ముబారక్‌ పాషాకు భార్య షిరాను బాను, ముగ్గురు పిల్లలు ఉన్నారు. (చదవండి: ప్రేయసి మైకంలో ప్రైవేటు పార్ట్‌కు డ్రగ్స్‌.. తెల్లారి లేచి చూస్తే

ఆగస్టు 18వ తేదీన చికెన్‌ ఫ్రై వండాలని భార్యకు చెప్పి భర్త బయటకు వెళ్లాడు. తిరిగి వచ్చి ఎంతో ఆశగా చూస్తే ఇంట్లో చికెన్‌ ఫ్రై వండలేదు. దీంతో అతడు నిరాశకు గురయ్యాడు. ఈ సమయంలో భార్యతో గొడవ జరిగింది. క్షణికావేశానికి లోనైన భర్త ఆమె తలపై ఓ చెక్కతో బలంగా బాదాడు. ఆ తర్వాత పాషా ఏమీ తెలియనట్టు ఉంటున్నాడు.  అయితే కొన్ని గంటలుగా ఆమె కనిపించకుండాపోవడంతో కుటుంబసభ్యులు గాలించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త కదలికలపై నిఘా వేశారు.

పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు. అయితే పోలీసుల విచారణ తీవ్రమవడంతో చివరకు ఆగస్టు చివరకు సోమవారం (ఆగస్ట్‌ 23) నేరుగా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని లొంగిపోయాడు. తర్వాత జరిగిన సంఘటన అంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. కొట్టిన దెబ్బతో తీవ్ర గాయాలపాలైన భార్య ఇంట్లోనే మృతి చెందింది. పిల్లలు రాత్రి నిద్రిస్తుండగా భార్య మృతదేహాన్ని ఓ సంచిలో వేసుకుని బయటకు వచ్చాడు. బైక్‌పై చిక్కబనవర సరస్సుకు చేరుకుని మృతదేహాన్ని నీటిలో పడేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే సరస్సులో మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

చదవండి: ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆలస్యం.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు